టీం ఇండియా భవిష్యత్తుకి గురువు అతను…!

-

ఇప్పుడు టీం ఇండియాలో రెగ్యులర్ గా ఆడే యువ ఆటగాళ్ళు ఎవరు…? అంటే అసలు ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడినా సరే జట్టులో ఉంటున్న యువ ఆటగాళ్ళు ఎంత మంది…? ముగ్గురు పేర్లు మనం ప్రధానంగా వింటాం. యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ ఓపెనర్ కెఎల్ రాహుల్, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. జట్టులో వీళ్ళ ప్రాధాన్యత ఇప్పుడు తక్కువే కాని, క్రీడా పండితులు మాత్రం వీళ్ళ అవసరం భవిష్యత్తు అంటూ ఒక్క మాటలో తెల్చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద టీం ఇండియా భవిష్యత్తు ఉందని అంటూ ఉంటారు.

ఈ ముగ్గురు అసలు టీం ఇండియా గడప తొక్కడానికి కారణం ఎవరు…? రాహుల్ ద్రావిడ్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఈ బ్యాటింగ్ దిగ్గజం కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఎంతగానో ఎదురు చూసాయి. మాకు కోచ్ గా రండీ అంటూ ఎన్నో విధాలుగా అడిగాయి. కాని అతను మాత్రం యువ భారత్ ని తయారు చేయడానికి కనీసం టీం ఇండియా సీనియర్ జట్టుకి కూడా కోచ్ అవ్వను అన్నాడు. 2017 చివర్లో అండర్ 19 వరల్డ్ కప్ యువ టీం ఇండియా గెలిచింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది కదా…?

దానికి ఘనత యువ ఆటగాళ్లకు ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదు. ద్రావిడ్ కి కప్పు ఇచ్చేసి అతని పాదాలకు నమస్కారం పెట్టి వచ్చేయమని పలువురు క్రీడా పండితులు యువ ఆటగాళ్లకు సూచించారు. ఎందుకంటే ఆ ఘనత ద్రావిడ్ కే సొంత౦. అండర్ 19 జట్టుకి కోచ్ గా సేవలు అందిస్తున్న ద్రావిడ్, ప్రతీ ఒక్క ఆటగాడి మీద దృష్టి పెట్టడం, జట్టులో రొటేషన్ పద్దతిలో ఏ ఒక్క ఆటగాడు కూడా అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాళ్లకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించడం, ఫీల్డింగ్ నుంచి బ్యాటింగ్ వరకు, బౌలింగ్ నుంచి కీపింగ్ వరకు,

ప్రతీ ఒక్క దాంట్లో ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతీ ఆటగాడిని తీర్చి దిద్దుతూ ఉంటాడు. ఆ టోర్నమెంట్ లో ఏ ఒక్క ఆటగాడు కూడా నిరాశ పడలేదు. ఆటగాళ్లను ఉదయమే లేపడం, వామప్ చేయించడం, వాళ్ళను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం, వ్యసనాలకు దూరం పెట్టడం ద్వారా తమలో ఉన్న ప్రతిభను వాళ్ళకు తెలియజేసాడు. ప్రపంచకప్ ఫైనల్ కి ముందు ఐపియల్ వేలం పాట జరిగింది. ఈ వేలం పాట గురించి యువ ఆటగాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమలో ఎవరిని ఎక్కువ ధరకు కొంటారో అని ఆసక్తి వాళ్లకు. దాన్ని గమనించిన ద్రావిడ్ వాళ్ళను కనీసం టీవీ కూడా చూడనివ్వలేదు. ఇంటర్నెట్ కి దూరంగా ఉంచాడు. కనీసం న్యూస్ పేపర్ కూడా చదవనివ్వలేదు. ఫలితం ప్రపంచకప్ తమ ఖాతాలో పడింది. అలా ఆటగాళ్ళ శిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తీర్చి దిద్దుతూ ఉంటాడు ద్రావిడ్. హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ముగ్గురు కూడా ద్రావిడ్ శిష్యులే. ఫీల్డింగ్ లో ఆ ముగ్గురిని చూసే ఉంటారు కదూ…?

ఫిట్నెస్ లో చూసే ఉంటారు కదూ, ముగ్గురు ఒక్క ఫార్మాట్ కే పరిమితం అయిన క్రికెటర్లా…? కాదు. టెస్ట్, వన్దే, టి20 ఇలా మూడు ఫార్మాట్లలో ఆడుతూ జట్టుకి కీలకంగా మారారు. వాళ్ళు ఆడకపోయినా అవకాశాలు ఇస్తూ జట్టులో కోహ్లీ ఉంచుతున్నాడు అంటే వాళ్ళు ద్రావిడ్ శిష్యులు కావడమే. శుభామన్ గిల్, పృథ్వీ షా భవిష్యత్తులో టీం ఇండియాలో కీలకంగా మారనున్నారు. సంజూ స్యామ్సన్ సహా పలువురు ఆటగాళ్ళు ద్రావిడ్ శిక్షణలో రాటు దేలుతున్నారు. ఐపియల్ ముఖ్యం కాదు భవిష్యత్తు ముఖ్యమని చెప్పి యువ భారత్ ని తయారు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version