ఎర్రవారిపాళెం గ్రామానికి ఇతనే ‘శ్రీమంతుడు’

-

ఒక్కప్పుడు ఆ గ్రామ ప్రజలు కరవుతో అలమటించేవారు. పొట్ట చేత పట్టి పనికి గల్ఫ్ దేశాల బాట పట్టేవారు. అయినా వారికి గుక్కెడు మెతుకులు దొరకటం కష్టమయ్యేది. తన స్నేహితుల దుస్థితిని చూసి చలించిన ఓ వ్యక్తి ఆ గ్రామ ముఖ చిత్రాన్ని మార్చేశాడు.

srimanthudu
srimanthudu

కంచన లోకేష్‌ చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళెం మండలం చింతకుంట గ్రామవాసి. 2013లో పండుగ సెలవుకు ఊరికి వచ్చాడు. తన తోటి స్నేహితులు లేరని తెలుసుకుని బాధ పడ్డాడు. వారందరు గల్ఫ్ దేశాలకు వెళ్లారని.. కానీ సంపాదించేది అరకొర మాత్రమేనని తెలుసుకుని వారికి ఎదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాత్రం ఆదాయం స్వగ్రామంలోనే ఉంటూ పొందవచ్చు అని గ్రామస్తులతో సమావేశం నిర్వహించాడు. స్థానికులు కూడా తన మాటలకు ఉత్సాహంతో ఒకరు ఇద్దరై, ఇద్దరు నలుగురై గ్రామస్తులంతా చైతన్య వంతులై అభివృద్ధి వైపు నడిచారు.

కూలీ పనులు కూడా చేసుకోలేని ఆ సమయంలో ఊర్లో నీటి కుంటలు తవ్వించాడు. ప్రభుత్వ పథకాల గురించి అక్కడి వారికి అవగాహన కల్పించాడు. ఆ పనులు ద్వారా సత్ఫలితాలు చేకూరే ఆలోచించే వాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఒప్పించి ఉద్యోగం మానేశారు లోకేష్‌. గ్రామస్తులతో కలసి పొలం బాట పట్టాడు. ఒక్కొక్కటిగా క్రమం తప్పకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్లాడు. రైతుల పంట పొలాల్లోనే 150 నీటి కుంటలు తవ్వించగలిగారు. పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం ద్వారా 22 రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. బీడు భూముల్లో 150 ఎకరాల్లో ఉద్యాన పంటలకు ఉపాధి పథకం అనుసంధానం ప్రక్రియ ద్వారా అవకాశం కల్పించారు.

గ్రామాభివృద్ధికి పాటు పడుతున్న లోకేష్‌కు గ్రామస్తులు సైతం అండగా నిలిచారు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుని సర్పంచ్ గా నిలబెట్టారు. రైతుల పొలాల్లో బోర్లు వేయటానికి కృషి చేశాడు. గ్రామంలోని చెరువులకు అనుసంధానంగా ఉన్న సప్లయి ఛానల్‌ పునరుద్ధరణ పనులు ఉపాధి పథకంలో మంజూరు చేయించి, కూలీలకు పనులు కల్పించి అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా ఆ చెరువులు నిండాయి. గ్రామస్థులు కలిసికట్టుగా వ్యవహరించడంతో 2,400 మంది జనాభా ఉన్న చింతకుంట పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా రెండుసార్లు అవార్డు దక్కింది. ఇప్పుడా గ్రామానికి లోకేష్ ‘శ్రీమంతుడిగా’ నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news