అతన్ని T20 ప్రపంచ కప్ కి ఎంపిక చేయాలి : మనోజ్ తివారి

-

భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన అద్భుతమైన బౌలింగ్తో ఐపీఎల్-17లో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తు ,కీలక బ్యాటర్ల వికెట్లు తీసిన లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయాలని మనోజ్ తివారీ తెలిపాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. తాను చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉంటే బుమ్రా, షమీ తర్వాత మయాంక్ను ఎంపిక చేస్తానని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘మయాంక్ ఫామ్, బౌలింగ్ యాక్షన్, బంతిని వదిలే విధానం చూస్తుంటే అతను పూర్తి నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నాడు అని అన్నారు. అతనికి పెద్ద వేదికల్లో అవకాశం ఇస్తే రాణించగలడనిపిస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. కాగా, టోర్నీలో మయాంక్ 6 వికెట్లతో లక్నో తరపున టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు.ఇదిలా ఉంటే.. మయాంక్ యాదవ్ ప్రదర్శన చూసి అతని తల్లిదండ్రులు కూడా త్వరలోనే భారత జట్టుకు ఆడతాడని, మెరుగ్గా రాణిస్తాడని తల్లి మమతా యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news