మీరు రెడీనా! మరింత ఆసక్తిని పెంచేస్తున్న ‘పుష్ప 2′ కౌంట్ డౌన్ పోస్టర్

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుండగా మాస్ జాతర మరో రెండు రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్ను విడుదల చేశారు. త్రిశూలంతో ఉన్న ఆ ఫొటో మూవీపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్ అల్లు అర్జున్ అభిమానులకి పూనకాలెత్తేలా ఉండనుందని మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news