చెన్నై లో అర్ధరాత్రి నడిరోడ్డుపై బిడ్డకు పురుడు పోసింది మహిళ హెడ్ కానిస్టేబుల్. వేలూరులో సౌత్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఇళవరసి అనే మహిళా కానిస్టేబుల్ ఈరోజు ఉదయం 1.30 సమయంలో నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో ఓ ఇంటిలో నుండి రోడ్డు పక్కనే నొప్పులతో విలపిస్తూ కనిపించింది 30 ఏళ్ల షబానా. చుట్టూ పక్కల ఎవరు లేకపోవడంతో అంబులెన్స్ కి కాల్ చేసింది.
పరిస్థితి చేయి దాటడంతో స్వయంగా మహిళలకు పురుడు పోసింది హెడ్ కానిస్టేబుల్ ఇళవరసి. భర్త వదిలేయడంతో 10 ఏళ్ల కొడుకుతో కలిసి బస్టాండ్‌లో భిక్షాటన ..ఇతరు ఇచ్చే ఆహారంతో బతుకుతుంది షాబానా. బిడ్డకు పురుడు పోసి… అంబులెన్స్ లో ఆసుపత్రి తరలించింది ఇళవరసి. ప్రస్తుతం బిడ్డ,తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పురుడు పోసిన తరువాత బిడ్డను చేతికి తీసుకుని కన్నీటి పర్యంతం అయింది హెడ్ కానిస్టేబుల్.