చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని కాల్ రికార్డును బయటపెట్టిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్ అయ్యారు. చిలకలూరిపేట శారదా హైస్కూల్ విద్యా కమిటీపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న రజని ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మికి ఫోన్ చేసి కమిటీని రద్దు చేయాలని ఆదేశించారు. అయితే ఈ విషయాన్ని ప్రస్తుతం కొనసాగుతోన్న విద్యా కమిటీకి ధనలక్ష్మి తెలియజేశారు.
అంతేకాకుండా, విద్యా కమిటీని రద్దు చేయాలనీ రజని తనతో మాట్లాడిన వాయిస్ రికార్డును కూడా కమిటీకి వినిపించారు. ఈ విషయం తెలుసుకున్న రజని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధనలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ధనలక్ష్మిని అధికారులు సస్పెండ్ చేశారు.