కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరికొన్ని అందాన్ని కాపడతాయి. ఇంకొన్ని అందం, ఆరోగ్యం రెండింటిని బ్యాలెన్స్ చేస్తాయి. ముఖ్యంగా ముఖం పై ముడతలు రాకుండా, యవ్వనంగా ఉండాలంటే ముప్పై రావడంతోనే కొన్ని పండ్లను డైలీ తినడం అలవాటు చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా తినక్కర్లలేదు. తింటే చాలు.. అలాంటి వాటిల్లో కివి ఫ్రూట్ గురించి అందిరికీ తెలుసు.. కానీ మీకు తెలియని ఇంకో ఫ్రూట్ కూడా ఉంది అదే..ఆప్రికాట్..స్కిన్ పిగ్మెంటేషన్ దూరం చేసి యవ్వనంగా ఉంచే అద్భుత ఫలం.. ఇది మీ ఆహారంలో అదనంగా చేర్చుకున్నట్టయితే..మంచి ఆరోగ్యంతో పాటు..మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది.
ఆప్రికాట్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సీ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన అనేక న్యూట్రీషియన్స్ అందిస్తుంది. పలు రకాల వ్యాధులను కూడా నివారిస్తోంది.
డ్రై ఆప్రికాట్‌తో కూడా ప్రయోజనమే..
పండు మాత్రమే కాదు, డ్రై ఆప్రికాట్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. డ్రై ఆప్రికాట్ జ్యూస్ తీసుకుంటే చర్మ సమస్యలు అన్నీ పోతాయట. ఎక్జిమా, దురద, తామర వంటి వాటిని నివారించి కాంతివంతంగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. దాహార్తి సమస్య ఉన్న వారికి ఇది మంచి పరిష్కారం అవుతుంది. ఎండిన ఆప్రికాట్‌లో అధిక న్యూట్రీషియన్స్ విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి చూపునకు బాగా సహాకరిస్తుంది. డ్రై ఆప్రికాట్ పెద్ద పేగులను శుభ్రపరచి అందులో నిల్వ ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే మజిల్ ఫంక్షన్స్, హార్ట్ బీట్‌ను రెగ్యులేట్ చేస్తుంది.
ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆప్రికాట్ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతూ, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ పండులో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను క్రమబద్దీకరించడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది.
కాబట్టి…జంక్‌ఫుడ్స్ తినే బదులు ఇలాంటి వాటిని తినడం వల్ల అటు ఆరోగ్యం ఇటు అందం రెండూ బాగుంటాయి. ముఖ్యంగా మహిళలకు ఈ పండు చాలా మేలు చేస్తుంది. తప్పకుండా తినేందుకు ప్రయత్నించండి మరీ..!