ఈ కరోనా మనుషులనే కాదు.. పండుగలను కూడా మార్చేసింది. అది ఎలా అంటారా దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎప్పుడు ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఇప్పుడు ఎవరి ఇంటిలో వారే జరుపుకుంటున్నారు. ప్రతి వీధిలో కనిపించే కోలాహలం, పండుగ వాతావరణం ఇప్పుడు లేదు. వీటన్నిటికి భిన్నంగా సూరత్ లోని ఆసుపత్రిలో నూతనంగా వినాయక చవితి జరుపుకుంటున్నారు. పండుగ కాదు .. ఆరోగ్యం కూడా ఉండాలి అంటూ… ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ తో ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేశారు.ఈ విగ్రహం సుమారు 20 అంగుళాలు ఉంది. దీన్ని ప్రత్యేకంగా కరోనా భారిన పడి చికిత్సపొందుతున్న రోగులకు కోసం తయారు చేశారు.
ఈ విగ్రహానికి ఇంత ప్రాముఖ్యత ఏమిటి అనుకుంటున్నారా.. ఇందులో వాడిన సామాగ్రి చూడండి మరి..వాల్‌నట్స్, వేరుశనగ, జీడిపప్పు, పైన్ కాయలు, బాదంలాంటి డ్రైఫ్రూట్స్‌ను వాడారు. తొండాన్ని వాల్‌నట్స్‌తో, కళ్లను జీడిపప్పుతో తయారుచేశారు. ఇలాంటి ఆరోగ్యకరమైన విటమిన్ కలిగిన ఆహారంతో విగ్రహాన్ని తయారు చేసి రోగులకు ఇచ్చారు. ఈ విగ్రహం కేవలం పూజ చేసుకోవడానికి కాదు.. ఆరోగ్యానికి పెంచుకోవడానికి కూడా అంటూ ఆ విగ్రహాన్ని ప్రసాదం లాగా తినమని రోగులకు సూచించారు.