జూన్ లో చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా.. ఏపీ మంత్రి ప్రకటన

-

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా అమలు చేయబోతున్నట్లు మంత్రి సవిత తాజాగా ప్రకటన చేశారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒకరోజు కచ్చితంగా చేనేత దుస్తులు ధరించాలని ఆమె ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు వివరించారు.

Health insurance for handloom workers in June.. AP Minister's announcement
Health insurance for handloom workers in June.. AP Minister’s announcement

ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు… స్పష్టమైన ప్రకటన చేశారు ఏపీ మంత్రి సవిత. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు ఉచిత కరెంటు కూడా ఇవ్వబోతున్నట్లు హామీ ఇచ్చారు. అంటే చేనేత మరమగ్గాలకు మాత్రమే ఈ ఉచిత కరెంటు వర్తించనుంది. ఇక దసరా పండుగ సమయం వరకు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి సంఘాల ఎన్నికలకు కూడా కసరత్తులు చేస్తామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news