తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కోవిడ్ నిర్దారణ టెస్టులు నిలిపివేసిన విషయం తెలిసిందే.. ఇక ఈ విషయం పై స్పందించారు తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంబిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యం గా నగారల్లో, జీహెచ్‌ఎంసి పరిడి లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గ్రామాల్లో ప్రభావం కొంత తక్కువగా ఉందని ఆయన అన్నారు. రెండు రోజులుగా నిలిపేసిన కోవిడ్ నిర్ధారణ టెస్టులు రేపటి నుండి మళ్ళీ ప్రారంభం కానున్నాయని ఆయన తెలియజేశారు.
రాష్ట్రంలో కరోనా పేషెంట్లకు చికిత్స సరిగ్గా అందడం లేదని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని అలాంటి వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ప్రతి పేషెంట్ కు సరిన చికిత్స అందిస్తున్నామని ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం అందరికీ చికిత్స అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. విద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారని ఇప్పటికే 258 మండి వైద్య సిబ్బంధి కరోనా బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లో వైద్య వనరులు వెంటిలేటర్లు బెడ్లు సరిపడా ఉన్నాయని ఎక్కడా కొరత లేదని మరో 10 వేల బెడ్లు తెప్పిస్తున్నామని ఆయన తెలియజేశారు.