10 రోజుల్లోనే గాంధీ, ఉస్మానియా భవనాలకు శంకుస్థాపన హెల్త్ మినిస్టర్

-

10 రోజుల్లోనే గాంధీ, ఉస్మానియా భవనాలకు శంకుస్థాపన చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.దేశంలో ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని సేవ చేయాలని డాక్టర్లకు సూచించారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్స్ తో కలిసి కేక్ కట్ చేశారు.

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఐఎంఏ స్థాపనకు బీసీ రాయ్ఆద్యుడు. త్వరలో గాంధీ, ఉస్మానియా, కాకతీయ హాస్ట్భవనాలకు శంకుస్థాపన చేస్తం అని తెలిపారు.2 సంవత్సరాలలో నిర్మాణాలు పూర్తిచేస్తం. ఆస్పత్రులను 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదు. సేవలు ఎలా అందుతున్నాయన్నదే ముఖ్యమని అన్నారు. కొత్తగా 435 డాక్టర్ పోస్టులు చేస్తం.డాక్టర్లు చెప్పే ప్రతి విషయాన్ని సామాన్యులు నమ్ముతారు. జూడాల సమస్యలు 80 శాతం పరిష్కరించాం అని అన్నారు. నీట్‌పరీక్షను రద్దు చేయాలా, కేంద్రం నిర్వహించాలా, రాష్ట్రాలకు ఇవ్వాలా అనేదానిపై చర్చ జరగాలి. కొత్త మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేశాం’ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news