ఒమీక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే ఈ హెల్త్ టిప్స్ ని పాటించండి..!

-

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది సతమతమయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి.. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం.

ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అయితే ఈ సూపర్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల నుంచి బయట పడవచ్చు. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

వెల్లుల్లి :

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఎన్నో రకాల వంటల్లో దీనిని వాడొచ్చు. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఇది చూసుకుంటుంది. అలానే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉండండి.

అల్లం :

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాల సమస్యలని ఇది తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలానే వికారం, గొంతు నొప్పి మొదలైన సమస్యలని తొలగిస్తుంది. ఇమ్మ్యూనిటీని కూడా పెంచుతుంది.

పాలకూర :

పాలకూర లో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్, బీటాకెరోటిన్ వంటివి ఉంటాయి అలానే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అది చూసుకుంటుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

పసుపు :

మనం తరచూ వంటల్లో పసుపుని వాడుతూ ఉంటాము ఇది ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకుంటుంది. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.

కివి :

కివి లో పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి ఇది కూడా ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది అలానే ఇతర ప్రయోజనాలను కూడా ఇస్తుంది కనుక వీటిని తీసుకుంటే ఒమీక్రాన్ ఇన్ఫెక్షన్ నుండి సురక్షితంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version