పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయ విధారక ఘటన

-

పార్వతీపురం మన్యం జిల్లా కారివలస గ్రామంలో తాజాగా హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆరిక జయలక్ష్మీ అనే గిరిజన మహిళ మరణించారు. ఆమె మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించే క్రమంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Heartbreaking incident in Karivalasa, Parvathipuram, Manyam districtHeartbreaking incident in Karivalasa, Parvathipuram, Manyam district
Heartbreaking incident in Karivalasa, Parvathipuram, Manyam district

గ్రామానికి స్మశానవాటిక మధ్యలో వాగు ప్రవహిస్తోంది. వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. తాజాగా నడుము లోతు నీరు ఉండటంతో, గ్రామస్తులు మృతదేహాన్ని నీటిలో మోసుకుంటూ స్మశానవాటికకు చేరుకున్నారు.

ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కళ్లలో నీరు తెప్పించుకున్నారు. ఈ సంఘ‌ట‌న‌తో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గ్రామస్తుల కన్నీటి కథ మరోసారివెలుగులోకి తెచ్చింది. వంతెన నిర్మాణం అత్యవసరం అని స్థానికులు… ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మ‌రి దీనిపై స‌ర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news