Asia Cup 2022 : ఇండియా, పాక్ జట్లకు భారీ జరిమానా !

-

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది. అయితే..ఈ మ్యాచ్ కు సంబంధించి ఐసీసీ తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసినందుకు గాను ఐసిసి భారత్, పాక్ లకు జరిమానా విధించింది.

ఇరు జట్ల మ్యాచ్ ఫీజు లో ఏకంగా 40% కోత విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తన నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం, మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేటు ఫైన్ తో పాటు మ్యాచ్ లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.

ఆ మ్యాచ్ లో ఈరోజు జట్లు కోటా సమయాన్ని దాటి అరగంట ఇన్నింగ్స్ ను పొడిగించారు. దీంతో ఆ అరగంట సమయంలో ఇరుజట్లు ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ తో బరిలో నిలిచాయి. దీని ప్రభావం భారత్ తో పోలిస్తే పాక్ పై అధికంగా పడింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ నిబంధనే పాక్ కొంప ముంచింది. చేతనలో హార్దిక్ చెలరేగడానికి ఈ నిబంధన పరోక్ష కారణంగా చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version