గత ఏడాది లడఖ్‌లో ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భారత్, చైనా తొమ్మిది రౌండ్ల సైనిక స్థాయి చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. లడఖ్ లోని సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం భారీ ఎత్తున దళాలను మోహరించిందని మంత్రి వివరించారు. తూర్పు లడఖ్ లో దళాలను వెనక్కు తీసుకోవడంపై భారత్, చైనా సీనియర్ మిలిటరీ కమాండర్లు పలు దఫాలు చర్చలు జరిపినట్లు జైశంకర్ శనివారం తెలిపారు.
జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇద్దరూ చైనా మంత్రులతో చర్చలు జరిపినప్పటికీ చర్చలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. శనివారం విజయవాడలో విలేకరులను ఉద్దేశించి జైశంకర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు చర్చలలో ఆశించిన ప్రతిఫలం లేదని ఆయన అన్నారు. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన సమస్య అని… ఎందుకంటే ఇది దళాలపై ఆధారపడి ఉంటుంది అని ఆయన అన్నారు.
రెండు దేశాల మధ్య మంత్రి స్థాయి చర్చలు జరుగుతాయా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భవిష్యత్తులో అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుందని అన్నారు. జైశంకర్ ఇంకా మాట్లాడుతూ, గత కొన్నేళ్ళుగా చోటు చేసుకున్న సంఘటనల తరువాత… అక్కడ చైనా దళాల సమూహాల నుండి వచ్చిన సవాలును ఎదుర్కోవడానికి మనం భారీగా బలగాలను మోహరించామని ఆయన తెలిపారు.