హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం

-

హైదరాబాద్​లో భారీ వర్షం కురుస్తోంది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్, శంషాబాద్‌, గండిపేట, అత్తాపూర్‌, బండ్లగూడ, మెహిదీపట్నం, ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే కార్వాన్, లంగర్‌హౌస్‌, గోల్కొండ, మల్లేపల్లి , హుస్సేన్‌సాగర్, ప్రాంతాల్లో వాన కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వర్షం కారణంగా గణనాథుల నిమజ్జనం ఆలస్యం అవుతుంది. రహదారుల పైకి నీరు రావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news