హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, బేగంపేట్‌తో పాటు పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను అడిగి తాజా పరిస్థితుల గురించి అధికారులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రజలు అత్యవరసమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఆయన సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు.