ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైం విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో సీటు కోసం ఆశించి భంగపడిన నేతలంతా తాజాగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. ఈ లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాలతోనే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో శిద్దా రాఘవరావు వెల్లడించారు.
శిద్దా రాఘవరావు సుదీర్ఘ కాలంలో టీడీపీలో పని చేశారు. రాష్ట్ర విభజనతో తర్వాత 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేదు. దీంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శిద్దారాఘవరావుకు వైఎస్ జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆయన తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.