తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావం కారణంగా మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ మందస్తు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం నుంచి తిరుమల కొండపై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో తిరుమలలోని మాడ వీధులన్నీ జలమయం అయ్యాయి.
శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులు పూర్తిగా తడుస్తూ ఆలయం నుంచి బయటకు వెళ్తున్నారు. అక్కడ షెడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీనిపై స్పందించిన టీటీడీ అదనపు ఈవీ వెంకయ్య.. ప్రస్తుతం షెడ్లు ఖాళీగా లేవని తెలిపారు. ఖాళీ అవ్వగానే మిగతా భక్తులను అందులోకి పంపిస్తామని తెలిపారు. ఇదిలాఉండగా, వర్షం ధాటికి మాడవీధుల్లో నిర్వహించే కార్యక్రమాలను రద్దుచేసినట్లు తెలుస్తోంది.