తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..!

-

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ దిశగా ఒంపు తిరిగడంతో..నేడు, రేపు ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే తెలంగాణ విషయానికొస్తే.. పలు జిల్లాల్లో శనివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

hyderabad gets heavy rains on thursday night

ఆదివారం సైతం పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇకపోతే ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.. దీనికితోడు నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news