ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు పడున్నాయి. పిడుగులు పడే ప్రమాదం కూడా పొంచిఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది APSDMA.

తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD వార్నింగ్ ఇచ్చింది. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఈ మేరకు వార్నింగ్ ఇచ్చింది.