హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది. 5 ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది. శేరిలింగంపల్లిలో 13.38 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. గచ్చిబౌలిలో 13.38 సె.మీ నమోదు కాగా సరూర్ నగర్ లో 12 సెంటీ మీటర్లు అత్యధిక వర్షపాతం నమోదు అయింది.

శ్రీ నగర్ కాలనీలో 12సెంటీమీటర్లు, ఖైరతాబాద్ సెస్ ప్రాంతంలో 11.88 సె.మీ, యూసఫ్ గూడలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఈ తరుణంలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద ప్రవాహం భారీగా పెరిగింది.
మరికాసేపట్లో హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి మూసీలోకి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సహాయం కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని సూచనలు చేశారు అధికారులు.