విజయవాడ లో హెలికాప్టర్ రైడ్…ధర ఎంతంటే..?

విజయవాడలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా హెలికాప్టర్ రైడ్ ను ప్రారంభించబోతున్నారు. ఈ రైడ్ కు 6మినిషాల పాటు 3,500 రూపాయలు టికెట్ ధర కాగా పది నిమిషాల రైడ్ కు ఆరు వేలు తీసుకునేలా ధరలు నిర్ణయించారు. దసరా సందర్భంగా మంత్రి వెల్లంపల్లి చేతుల మీదగా హెలిప్యాడ్ ను ప్రారంభించబోతున్నారు.

ఇక కొత్తగా ప్రారంభించబోతున్న హెలికాప్టర్ రైడ్ తో విజయవాడ వాసులు హెలిక్యాప్టర్ లో చక్కర్లు కొడుతూ నగర అందాలను వీక్షించవచ్చు. రెండేళ్ల లోపు చిన్న పిల్లలకు కూడా హెలికాప్టర్ రైడ్ కు అనుమతి ఇస్తూ వారికి టికెట్ ఫ్రీ గా పేర్కొన్నారు. ఇక కొత్తగా ప్రారంభించబోయే హెలిప్యాడ్ తో చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా హెలికాప్టర్ రైడ్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లో హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.