ఏపీలో అంతర్జాతీయ స్మగ్లర్‌ రామనాథరెడ్డి అరెస్టు

చిత్తూరు : చిత్తూరు జిల్లా లో అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథ రెడ్డి అరెస్ట్ అయ్యాడు.. కుప్పం – కృష్ణగిరి హైవే లో అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథరెడ్డి ని అరెస్టు చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. కుప్పం నియోజక వర్గం నుండి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తుండగా చిత్తూరు పోలీసులు అరెస్టు చేసారు.

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథ రెడ్డి ను అరెస్ట్ చేయడం తో పాటు రూ. 50 లక్షల విలువైన ఎర్ర చందనాన్ని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్‌ రామనాథ రెడ్డితో సహా ముగ్గురు అనుచరులనూ కూడా అరెస్టు చేశామని ఎస్‌ఈబీ ఏఎస్పీ విద్యాసాగర్ స్పష్టం చేశారు. లారీ, కారు సహా యాబై లక్షలు విలువ చేసే 62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు విద్యాసాగర్.. అలాగే… స్మగ్లర్ రామనాధరెడ్డి పై రాయలసీమ లోని నాలుగు జిల్లాలో 60 పైగా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక ముందు ఇలాంటి స్మగ్లింగ్‌ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.