మద్ధతు ధరకే దిక్కులేదు.. బోనస్ ఎప్పుడిస్తరు : కేటీఆర్

-

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పత్తి కొనుగోళ్ల తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తెల్ల బంగారం తెల్లబోతోందని, పత్తి రైతులు దళారుల చేతుల్లో చిత్తవుతున్నారన్నారు. ఓ వైపు సీసీఐ తేమ శాతం, క్వాలిటీ అంటూ కొర్రీలు పెడుతూ.. రైతులను ఇబ్బందుకు గురి చేస్తుందని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు సాకులు చూపెట్టి కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసిందని మండిపడ్డారు.

అన్నదాతలు ఆగం అవుతుంటే పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందన్నారు.క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్.. నేడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుందని ధ్వజమెత్తారు. తెలంగాణలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి.. కాటన్ కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి చొరవ తీసుకునే సమయం,శ్రద్ధా రెండూ లేకుండా పోయాయన్నారు.ఇప్పటికే దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేశారని..సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు పెట్టారన్నారు. తాజాగా పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారని..‘కర్షక ద్రోహి కాంగ్రెస్‌.. రైతు డిక్లరేషన్ బోగస్’ అంటూ ట్వీట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version