టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి హేమ కూడా ఒకరు. చాలా సినిమాల్లో హేమ తల్లి, అక్క లాంటి పాత్రలు చేసి అలరించింది. ముఖ్యంగా కామెడీని పండించే లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అతడు సినిమాలో బ్రహ్మానందంకు భార్యగా నటించి కామెడీ టైమింగ్ తో నవ్వించింది. కేవలం కామెడీ సీన్లలోనే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఎంతో భాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే కెరీర్ మొదట్లో మాత్రం తాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. ఏపీకి చెందిన హేమ సినిమా అవకాశల కోసం చెన్నై కి వెళ్లింది. అక్కడ నుండి మళ్లీ హైదరాబాద్ కు వచ్చింది. ఇక ఇప్పుడంటే షూటింగ్ లకు వెళ్లినప్పుడు బట్టలు మార్చుకునేందుకు క్యారెవ్యాన్ లు ఉండేవి గానీ అప్పట్లో అలాంటివి ఏమీ ఉండేవి కాదని చెప్పింది. దుస్తులు మార్చుకోవాలన్నా…టాయిలెట్ కు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పింది.
తమ కంటే ముందు తరం నటీమణులు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడ్డారని ఎమోషనల్ అయ్యింది. ఇక ఓ ప్రొడక్షన్ బాయ్ తనను అవమానించిన సంఘనను హేమ గుర్తుచేసుకుంది. ముత్యాల సుబ్బయ్యగారి భారతనారి అనే సినిమాలో నటిస్తున్న సమయంలో తాను డైరెక్టర్ మరికొందరి తో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఓ ప్రొడక్షన్ బాయ్ తనను పక్కకు వెళ్లి తినమన్నారన్ని చెప్పింది. దాంతో తనకు కోపం వచ్చి అక్కడే ఉన్న టేబుల్ ను విసిరేసానని కుర్చీని అతడిపై విసిరేసానని తెలిపింది. ఆ ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ ఉన్నాడని కానీ ఓ సినిమా షూటింగ్ సమయంలో అతడే తనకు ఎంతో గౌరవం ఇచ్చాడని చెప్పింది.