కాంగ్రెస్-కమలంకు 7 సీట్లేనా?

-

అవును కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీలకు 7 సీట్లే వస్తాయి. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఏడు సీట్లు మాత్రమే గెలుచుకుంటాయి. మరి ఈ ఏడు సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లారిటీ లేదు. కానీ రెండు పార్టీలకు కలిపి మాత్రం ఏడు సీట్లు వస్తాయని కేసీఆర్ లెక్కలు రుజువు చేస్తున్నాయి. అదేంటి గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు పుంజుకున్నాయి..పైగా టీఆర్ఎస్ బలం తగ్గుతుంది. అసలు ఇటీవల ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ని బీజేపీ మట్టికరిపించింది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అయినా సరే ఆ పార్టీలకు ఆ సీట్లేనా వచ్చేది అంటే…కేసీఆర్ తాజా మీడియా సమావేశంలో అలాగే చెప్పారు. మళ్ళీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 సీట్లతో మరొకసారి అధికారంలోకి రాబోతుందని కేసీఆర్ గట్టిగా చెప్పారు. అంటే 95 పైనే..105 సీట్ల లోపు టీఆర్ఎస్ గెలుచుకుంటుంది అనమాట. సరే టీఆర్ఎస్ విషయం పక్కనబెడితే ఎం‌ఐ‌ఎం ఖచ్చితంగా 7 సీట్లు గెలుచుకుంటుంది. అంటే 105 ప్లస్ 7 కలుపుకుంటే 112…ఇంకా మిగిలేది ఏడు సీట్లు. ఆ సీట్లే కాంగ్రెస్-బీజేపీలు గెలుచుకునేది.

మరి ఇదంతా జరుగుతుందా? అంటే కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప ఇందులో నిజం పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో సెంటిమెంట్‌తో గెలిచి రెండుసార్లు అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మరి ఈ సారి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా లేదు. పైగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అయినా సరే కేసీఆర్ గెలుపుపై ధీమాగా ఉండటమే కాకుండా, 105 సీట్లు వరకు వచ్చేస్తాయని మాట్లాడుతున్నారు.

అంటే ప్రశాంత్ కిషోర్‌ని నమ్ముకుని కేసీఆర్ ఈ మాట చెబుతున్నారా? అనేది కూడా డౌట్‌ ఉంది. అయితే టీఆర్ఎస్ ఈ సారి ఈజీగా గెలవలేదు. బలంగా ఉన్న కాంగ్రెస్-బీజేపీలని ఢీకొట్టడం ఈ సారి అంత సులువు కాదు. కాబట్టి కేసీఆర్ మాటలు నిజమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news