విశ్వాస పరీక్ష, మంత్రివర్గ విస్తరణకు హేమంత్ సోరెన్ సిద్ధము.. ఎప్పుడంటే..?

-

జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈనెల 8వ తేదీ సోమవారంనాడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే క్యాబినెట్ ని కూడా సీఎం హేమంత్ సోరెన్ విస్తరించనున్నారు. ఇటీవల వేగంగా చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా హేమంత్ సోరెన్ జార్ఖాండ్ 13వ సీఎంగా జూలై 4న ప్రమాణస్వీకారం చేశారు.

భూ కుంభకోణానికి సంబధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ అరెస్ట్ కావడంతో జేఎంఎం నేత చంపాయి సోరెన్ రాష్ట్ర 12వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ 5 నెలల అనంతరం జార్ఖాండ్ హైకోర్టు ఆదేశాలతో జూన్ 28న బెయిలుపై విడుదలయ్యారు. ఆ వెంటనే చంపాయి సోరెన్ నివాసంలో జేఎంఎం శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, చంపాయి సోరెన్ రాజీనామా చేయడంతో తిరిగి సీఎంగా హేమంత్ సోరెన్ పదవి బాధ్యతలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news