జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగింది. తొలుత జులై 7వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయొచ్చని అందరూ భావించారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆయన జులై 4నే సీఎంగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జార్ఖండ్ ముక్తి మోర్చా పితామహుడైన హేమంతో సోరెన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శిభు సోరెన్ హాజరయ్యారు.
కాగా.. హేమంత్ సోరెన్ భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలతో జనవరిలో అరెస్ట్ అయ్యారు. ఈడి తనని అరెస్టు చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఆయన స్థానంలో జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ కుంభకోణంలో హేమంత్ సోరెన్ ది ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు రికార్డులు లేకపోవడంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇలా జైలు నుంచి బయటకొచ్చిన ఆయన మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా మద్దతు లభించింది.ఈ తరుణంలోనే చంపై సోరెన్ బుధవారం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, గవర్నర్‌కు సమర్పించారు.