హేమంత్ హత్య : ఉద్యమానికి దిగనున్న ఆర్యవైశ్య మహాసభ !

-

ఆర్యవైశ్యులపై దాడులు హేయమని ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ అన్నారు. ఆర్థిక తారతమ్యాలు చూసి పరువు హత్యలు చేయడం దారుణం అని పేర్కొన్న ఆయన హేమంత్ హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందనీ అన్నారు. హేమంత్ హత్యపై ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉద్యమం చేపడుతుందన్న ఆయన ఈ హత్యలో ప్రదాన సూత్రదారులు అమ్మాయి మేనమామలేనని అన్నారు. ఈ కేసులో హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

అలానే హంతకులకు శిక్షపడేంత వరకు ఆర్యవైశ్య మహాసభ పోరాడుతుందని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇక ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే దాదాపు 18 మందిని అరెస్ట్ చేశారు. తన చెల్లి బాధ చూడలేకనే ఈ హత్య చేశానని ఈ మర్డర్ సూత్రధారి యుగంధర్ రెడ్డి పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆర్య వైశ్య మహా సభ ఎంటర్ కావడం మీద కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమృత కేస్ లో మారుతీ రావు తమ కులం వాడని చెప్పి మర్డర్ చేసిన వ్యక్తి తో ర్యాలీలు చేశారని, ఇప్పుడు ఎందుకు హత్య చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news