డెడ్ స్కిన్ ని తొలగించడానికి సులువైన మార్గాలు ఇవే..!

-

సాధారణంగా చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. ఎక్కువసేపు షూ, సాక్స్ ధరించినపుడు ఈ సమస్య వస్తుంది. లేదా సరైన మాయిశ్చర్ అందక పోయినప్పుడు కూడా ఉంటుంది. మీ పాదాలలో డెడ్ స్కిన్ ను తొలగించుకోవడానికి ఈ రెమిడీస్ ని పాటించండి. దీనితో సులభమవుతుంది.

ఎప్సం సాల్ట్:

ఎప్సం సాల్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. మీరు కొద్దిగా సాల్ట్ ని తీసుకుని గోరువెచ్చని నీటిలో వేసి స్నానానికి వెళ్లేముందు మీ పాదాలను అందులో ఉంచండి. ఇలా చేయడం వల్ల చర్మం సాఫ్ట్ గా స్మూత్ గా అవుతుంది మరియు డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది.

మీరు బకెట్లో లేదా టబ్ లో నీళ్లు వేసి కాళ్లు పెట్టుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఈ పద్ధతిని కనీసం 20 నుంచి 25 నిమిషాల వరకూ పాటించండి మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా వల్ల కూడా మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే బేకింగ్ సోడా ని ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే…

గోరువెచ్చని నీటిలో ఒక నుంచి రెండు కప్పులు బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ సోడా నీళ్లలో కరిగిపోయిన తర్వాత 40 నిమిషాల పాటు మీ పాదాలను అందులో ఉంచండి. ఆ తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత టవల్ తో మీ పాదాలు తుడిచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి.

ప్యూమిక్ స్టోన్:

స్నానం చేసేటప్పుడు ప్యూమిక్ స్టోన్ ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది అయితే ప్యూమిక్ స్టోన్ రెమిడీ ఉపయోగించేటప్పుడు రెండు నుంచి మూడు కప్పుల నీళ్లు మరిగించి బకెట్లో వేసుకోండి.

దానిలో మీరు చల్ల నీళ్లు కూడా వేసుకోండి. బకెట్లో మీ పాదాలుని పెట్టి… పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత ప్యూమిక్ స్టోన్ తో మీ పాదాలను రుద్దండి ఇలా మీరు చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version