రోజుకు రూ.100తో రూ.34 ల‌క్ష‌లు పొందే చాన్స్‌..! ఎలాగంటే..?

-

ఈ మ‌ధ్య కాలంలో జ‌నాలు మ్యుచువల్ ఫండ్స్‌లో బాగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. దీర్ఘ‌కాలికంగా చూస్తే వీటి వ‌ల్ల ఎంతో లాభం పొంద‌వ‌చ్చు. అందుక‌నే చాలా మంది వీటిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబ‌డి పెట్ట‌లేం.. చాలా చిన్న మొత్తంతో ప్రారంభిస్తాం.. అనుకునేవారు ఈక్విటీ మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో ఎస్ఐపీల ద్వారా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)తో చాలా త‌క్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెట్టి డ‌బ్బులు ఆదా చేయ‌వ‌చ్చు. అలాగే దీర్ఘ‌కాలంలో పెద్ద ఎత్తున లాభం కూడా పొంద‌వ‌చ్చు.

here it is how you can get rs 34 lakhs in 15 years with investing daily rs 100

గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ఎస్ఐపీల‌లో పెట్టుబ‌డులు పెట్టే వారికి ఏడాదికి 20 శాతం వ‌డ్డీ రేటును ఇస్తున్నారు. అందువ‌ల్ల చిన్న మొత్తాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే వారికి ఎస్ఐపీ అత్యుత్త‌మ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో రోజుకు రూ.100 చొప్పున నెల‌కు రూ.3వేలు లేదా అంత‌క‌న్నా ఎక్కువ పెట్టుబ‌డి పెడితే ఏడాదికి 20 శాతం రిట‌ర్న్స్‌తో 15 ఏళ్ల‌కు రూ.34 ల‌క్ష‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. 15 ఏళ్ల కాలంలో మీరు పెట్టే మొత్తం పెట్టుబ‌డి రూ.5.40 ల‌క్ష‌లు అవుతుంది. కానీ వ‌డ్డీతో క‌లిపి రూ.34 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. అంటే మీరు పెట్టే పెట్టుబ‌డికి అద‌నంగా రూ.28.60 ల‌క్ష‌లు క‌లిపి ఇస్తార‌న్న‌మాట‌.

అయితే మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడితే లాస్ వ‌స్తుంద‌ని అనుకుంటారు. కానీ ఆ రిస్క్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఒకే కంపెనీలో స్టాక్స్‌, బాండ్స్ కొన‌రు. భిన్న ర‌కాల కంపెనీల్లో పెట్టుబ‌డులు పెడుతారు. అందువ‌ల్ల ఒక కంపెనీ వ‌ల్ల లాస్ అయినా.. మ‌రొక కంపెనీలో లాభం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఇందులో రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ప‌లు కంపెనీలు 20 శాతం క‌న్నా ఎక్కువే వ‌డ్డీని ఇస్తున్నాయి. అందువ‌ల్ల వాటిని గురించి తెలుసుకుని పెట్టుబ‌డి పెడితే దీర్ఘ‌కాలంలో మ‌రింత ఎక్కువ మొత్తంలో లాభాలు పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news