చాల మంది LIC పాలసీలని తీసుకుంటూ వుంటారు. తాజాగా తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్త అందించింది. అయితే చాల మంది వివిధ కారణాల వలన కట్టలేక ఆపేస్తూ వుంటారు. ఇలా చేయడం వల్ల ఎల్‌ఐసీ పాలసీ లాప్స్ అవుతూ ఉంటాయి. అయితే మీరు ప్రీమియం చెల్లించ లేక రెండేళ్లకు పైగా ల్యాప్స్ అయినా కూడా తిరిగి పాలసీలను పొందవచ్చు.
అయితే మీరు ఇప్పుడు ఎంతో ఈజీగా వాటిని తిరిగి పొందవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక పద్దతి ద్వారా మీ పాలసీని రన్ చేయవచ్చు. దీనిని చెయ్యకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీ పునరుద్ధరణకు ఐదేళ్ల వరకు గడువు ఉంది. అలానే యూనిట్ లింక్డ్ పాలసీలకు 3 ఏళ్ల గడువు ఇచ్చింది.
పాలసీ ల్యాప్స్ అయిన వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకుంటే…. పాలసీ ప్రయోజనాలను మళ్లీ యథావిధిగా పొందవచ్చు. ఈ పాలసీలు రన్ చేయాలంటే మాత్రం అప్పటి వరకు ఆపేసిన కాలానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం సంస్థ కొన్ని నియమ నిబంధలను అమలు చేస్తోంది గమనించండి. వార్షిక ప్రీమియంలో రూ.లక్షకు ఆలస్య రుసుము లో 20 శాతం లేదా గరిష్టంగా రూ.2000 లభిస్తాయి.
పాలసీదారుడి వార్షిక ప్రీమియం లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉంటే అతడికి 25 శాతం లేదా రూ.2500 తగ్గింపు ఉంటుంది. ఇక మూడు లక్షల పై ఉంటే 30 శాతం లేదా రూ.3000 తగ్గింపు లభిస్తుంది. ఇది ఇలా ఉంటే అధిక రిస్క్ ప్లాన్స్ విషయంలో, ఆలస్య రుసుము లో మినహాయింపు ఉండదు.