చిత్ర పరిశ్రమలో మరో విషాదం..హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు మృతి

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను పెను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులను పొగోట్టుకున్న చిత్ర పరిశ్రమ… నిన్నటి రోజున … గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ని పొగొట్టుకుంది. ఆయన మృతి తో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. అయితే.. ఆ సంఘటన మరువక ముందే.. మరో విషాదం చోటు చేసుకుంది.

టాలీవుడ్‌ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు మృతి చెందాడు. ఆయన తమ్ముడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి ఇవాళ ఉదయం మరణించాడు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు రామాంజులు రెడ్డి. ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో హీరో అబ్బవరం కిరణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news