సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరో అజిత్..

-

హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరోలందరిది ఒక రూటు..అజిత్ రూటు సపరేటు.. ఆయనకు నటన వృత్తి. బైక్‌ రేస్, రైఫిల్‌ షూటింగ్‌ ప్రవృత్తి. అగ్ర కథానాయకుడిగా రాణిస్తునే మరోపక్క మనసుకు నచ్చిన పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు.మొన్నీమధ్య రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు..సినిమా కన్నా ముందు తాను గేమ్స్ ను ఎక్కువ ఇష్ట పడతానని చాలా సందర్భాల్లో చెప్పాడు.

అనంతరం 30 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బైక్‌పై ప్రయాణించి మక్కువను తీర్చుకున్నారు. ప్రస్తుతం హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ నిర్మిస్తున్న తుణివు చిత్ర షూటింగ్‌ పూర్తి చేశారు. ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే మిగిలింది. నటి మంజు వారియర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు.బ్యాంక్‌ రాబరింగ్‌ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అజిత్‌ మరోసారి బైక్‌పై ప్రపంచాన్ని చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన భారీ బైక్‌ ప్రయాణానికి ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 18 నెలల బైక్‌ ప్రయాణంలో అంటార్కిటికా సహా ఏడు ఖండాలు దాటి 62 దేశాలు చుట్టి రానున్నారని సమాచారం..

అంతకన్నా ముందు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించడానికి అజిత్‌ సిద్ధం అవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అజిత్‌ బైక్‌ ప్రయాణం ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీంతో ఆయన ఏడాదిన్నర పాటు సినీ ప్రపంచానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.ఈ వార్త విన్న సినీ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.. మరి అజిత్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పాడా..లేదా అన్నది తెలియాల్సి వుంది..

Read more RELATED
Recommended to you

Latest news