గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 40 రోజుల పోరాటం తరువాత అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అద్భుతమైన గాయకుడిగా 45 వేలకు పైగా పాటలు పాడి గాయకుడిగా అరుదైన ఘనతను సాధించారు. తన పాటలతో ఆబాల గోపాలాన్ని ఓలలాడించారు. తన గాన మాధుర్యంతో తన్మయత్వంతో మైమరిచిపోయేలా చేశారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి భారత రత్న ఇవ్వడం సముచితం అని హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఐదున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో బాలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 45 వేలకు మించి పాటలు పాడారు. ఇది ఓ గాయకుడిగా ఆయన నెలకొల్పిన రికార్డ్. రోజుకు నాలుగైదు పాటులు విన్నా ఇక చాలు అనిపిస్తుంది. కానీ బాలు పాట అలా కాదు వింటున్న కొద్దీ మధురంగా శ్రావ్యంగా వుంటూ మైమరపింపజేస్తుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ గ్రేట్ హ్యుమన్ బీయింగ్. అలాంటి వ్యక్తికి భారతరత్నం ఇవ్వడమే సముచితం అని హీరో అర్జున్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ని ఎవరు ముందుకు తీసుకెళతారో చూడాలి.