బాలయ్యబాబు కు భయం అంటే తెలియదు గురూ..!!

-

ఇప్పుడు వున్న సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ గురించి చాలా మంది ఆయన చాలా కోపిష్టి అని అంటూవుంటారు.ఇప్పుడు చాలా మంది అన్ స్స్టాపబుల్ షో లో నిజమైన బాలయ్యను చూసి అసలు నిజం తెలుసుకొని పిదా అయ్యారు.వాస్తవానికి మొదట్లో ఈ షో పై చాలా అనుమానాలు కలిగాయి.కాని బాలయ్య తన మాటతీరు, చలాకి తనంతో ఆకట్టు కున్నారు. దీనితో షో సూపర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం సెకండ్ సీజన్లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబు, లోకేశ్ వచ్చి సందడి చేశారు. తర్వాత  చిరంజీవి, పవన్ , వెంకటేష్ అనే పేర్లు వినపడ్డాయి.కాని సెకండ్ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్, డి జే టిల్లు సిద్దార్థ వచ్చారు.మూడవ ఎపిసోడ్ కి అడివి శేష్, శర్వానంద్ వచ్చారు. అలాగే గతవారం అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు, సురేష్ బాబు వచ్చారు. వారిని కూడా తన ప్రశ్నలు తో ముప్పు తిప్పలు పెట్టారు.

వాస్తవానికి బాలయ్య బాబు అంత చలాకీగా ఉంటారని ఆయన అభిమానులకి, సామాన్య ప్రజలకు కూడా తెలియదు. తన చొరవ, హ్యూమరస్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటూ ఉన్నాడు.చంద్రబాబు నాయుడు ను వెన్నపోటు గురించి అడిగి దైర్యం ప్రదర్శించాడు. వాస్తవానికి ఆ ప్రశ్న లో తనకు కూడా భాగం ఉంది, ఎందుకంటే అప్పట్లో కుటుంబ సభ్యులు కూడా మద్దతు పలికారని అన్నారు. అలాగే రీసెంట్ ఎపిసోడ్ లో తన సినిమా కు థియేటర్స్ ఇచ్చే విషయం పై అలాగే నేపోటిజం పై ప్రశ్నలు అడిగారు. బాలయ్య సినిమాలో చెప్పినట్లు ఈ బ్లడ్ కు భయం అంటే తెలియదు అన్నట్లే షో లో కూడా నిరూపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news