హీరో నందమూరి బాలకృష్ణకి ఆపరేషన్.. ఆందోళనలో ఫాన్స్ !

-

టాలీవుడ్ సీనియర్ హీరో, టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ ఫాన్స్ కి ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ సర్జరీ జరిగింది. గత కొంత కాలం గా ఎడమ భుజం నొప్పి తో బాధ పడుతున్న బాల కృష్ణకు.. తాజాగా ఆపరేషన్ జరిగినట్లు సమాచారం అందుతోంది. నిన్న కేర్ హాస్పిట ల్లో డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యం లో నందమూరి బాలకృష్ణ ఫాన్స్ కి ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్ విజయవంతం కావడం తో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ కానున్నారు నందమూరి బాలకృ ష్ణ. ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పిన ట్లు తెలుస్తోంది. డాక్టర్లు సూచనలతో… నందమూరి బాలకృష్ణ షూటింగ్ కు దూరం కానున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కు ఆపరేషన్ జరిగిందన్న విషయం తెలియగానే.. ఆయన ఫాన్స్ మరియు మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలయ్య తొందరగా కొలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆయన ఫాన్స్. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news