హీరో మోటోకార్ప్‌ సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ గా రామ్ చరణ్

-

హీరో మోటోకార్ప్‌ సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ నటుడు రాంచరణ్‌ తేజ్‌ ను నియమించుకుంది. గ్లామర్‌ ఎక్స్‌టెక్‌ అనే మోడల్‌కి ఆయన ప్రచారం చేస్తారు. బైక్‌ స్టైల్‌, సేఫ్టీ మరియు పెర్ఫార్మెన్స్‌కి హీరో రాంచరణ్‌ సింబాలిక్‌గా నిలుస్తారని హీరో మోటోకార్ప్‌ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. హీరో కంపెనీతో కలిసి పనిచేయనుండటం, గ్లామర్‌ ఎక్స్‌టెక్‌ గురించి తన ద్వారా మరింత మందికి తెలియనుండటం పట్ల రాంచరణ్‌తేజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన అభిమానులకు కూడా ఇది గుడ్‌ న్యూస్‌ అని చెప్పొచ్చు. కాగా రామ్ చరణ్..RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పైన ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version