టీవీల్లోకి రానున్న హీరో నాని సూపర్ హిట్ మూవీ

-

శౌర్యువ్ డైరెక్షన్ లో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం రిలీజై సైలెంట్‌ హిట్‌ అందుకుంది.ఈ మూవీని ఈ నెల 17న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నట్లు జెమినీ వెల్లడించింది. ‘మార్చి నెలకు హాయ్ నాన్న డేట్తో స్వాగతం పలుకుతున్నాం. 17న మీకు ప్రేమ, నవ్వులు, లెక్కలేనన్ని ఎమోషన్స్ ఇవ్వడానికి వస్తోంది’ అని ట్వీట్ చేసింది. డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లోనూ రికార్డు వ్యూస్ ను సాధించింది.

ఈ చిత్రం లో బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించాడు.వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల నిర్మించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news