మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పకనే చెప్పారు మహాసేన రాజేష్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్ మాసంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంతోపాటు అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటున్నాయి. ఇక మరి కొంతమంది టికెట్టు రాకపోవడంతో పార్టీలు కూడా మారుతున్నారు. ఈ తరుణంలోనే.. అసెంబ్లీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పకనే చెప్పారు మహాసేన రాజేష్. పి.గన్నవరం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నాడని సమచారం. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దాని వల్ల టీడీపీ పార్టీకి నష్టం జరుగుతుందన్నారు మహాసేన రాజేష్.