నితిన్ కూడా మొదలెట్టేశాడుగా..!

-

ప్రస్తుతం హీరోలందరూ ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మంచి క్రేజ్ వున్న హీరోలతో కమర్షియల్ యాడ్ చేస్తే తమ బ్రాండ్ కి మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అని అటు బ్రాండ్స్ యాజమాన్యాలు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు వివిధ బ్రాండ్లకు సంబంధించిన కమర్షియల్ యాడ్స్ లో చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు యువ హీరో నితిన్ కూడా కమర్షియల్ యాడ్స్ చేసే హీరోల జాబితాలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఇలా కమర్షియల్ యాడ్స్ చేస్తున్న హీరోల జాబితా క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా కమర్షియల్ యాడ్స్ చేశారు. ఇక ఇప్పుడు యువ హీరో నితిన్ కూడా… త్వరలో ఓ సాఫ్ట్ డ్రింక్ కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఇక దీని కోసం ఇటీవలే ఫోటో షూట్ లో పాల్గొన్న నితిన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version