నితిన్ పెళ్లి కుదిరింది గా, అమ్మాయి ఎవరు అంటే…!

-

టాలివుడ్ లో కొందరి పెళ్ళిళ్ళ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. వారిలో రానా, ప్రభాస్, శర్వానంద్, నితిన్ ఎప్పుడూ ముందు ఉంటారు. వాళ్ళు చెప్పరు, వీళ్ళకు ఆత్రం ఆగదు అన్నట్టు ఉంటుంది అభిమానుల సందడి. ఎప్పుడో శ్రీనివాస కళ్యాణం సమయంలో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పిన నితిన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అయితే త్వరలోనే అతను పెళ్లి చేసుకుంటున్నాడు.

కుటుంబ సభ్యులు ఇప్పటికే అన్ని కార్యక్రమాలను మొదలుపెట్టారని అంటున్నారు. 2020 ఏప్రిల్ 16 న నితిన్ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని టాలివుడ్ సర్కిల్స్ లో వార్తలు వినపడుతున్నాయి. లండన్ లో ఎంబీయే చదివిన శాలిని అనే అమ్మాయితో నితిన్ వివాహం జరుగుతుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇది లవ్ మ్యారేజ్ అని అంటున్నారు కొందరు.

వీళ్ళు ప్రేమించుకుని ఇంట్లో చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు ఓకే చెప్పారని అంటున్నారు. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వీరి వివాహం జరగనుందని, ఏప్రిల్ 14, 15న ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఏ విధమైన అధికారిక ప్రకటనా లేకపోయినా సరే టాలివుడ్ లో మాత్రం ఇది నిజమే, త్వరలోనే నితిన్ స్వయంగా చెప్తాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version