కరోనా నుండి కోలుకున్న జీవిత.. ఇంకా ఆసుపత్రిలోనే రాజశేఖర్

-

అలనాటి హీరో రాజ‌ శేఖర్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం కుదుట‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది. కొద్ది సేప‌టి క్రితం సిటీ న్యూరో సెంటర్ నుండి రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుద‌ల అయింది. ఆయన ఆరోగ్యం కుదుట పడుతోందని ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొంది.

అలానే తమ స్పెషల్ క్లినిక‌ల్ టీం ప్ర‌త్యేక పర్యవేక్ష‌ణ‌లో ఆయ‌న‌కు చికిత్స ఇస్తున్నామని పేర్కొంది. ఇక అందుతున్న సమాచారం మేరకు తొలుత రాజశేఖర్ తో పాటు జీవిత రాజ‌శేఖ‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ‌గా, ఆమె కూడా సినీ న్యూరో ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతోంది. అయితే ఈరోజు జ‌రిపిన ప‌రీక్ష‌లో జీవిత‌కు నెగెటివ్‌గా నిర్ధార‌ణ కాగా, ఆమెను ఈ రోజు ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేయ‌నున్నామని అదే బులెటిన్ లో పేర్కొన్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news