తిరుమల శ్రీవారి ఆలయం పోటులో పేలిన బాయిలర్ బ్లాస్ట్ అయింది. ఈ బ్లాస్ట్ వలన ఐదుగురు కార్మికులకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రసాదాలు తయారు చేసే వకుళా మాత పోటులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారని అంటున్నారు.
ప్రసాదంగా పెట్టె పులిహోర కోసం చింత పండు రసం వేడి చేస్తుండగా బాయిలర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలోకి మరింత మంది భక్తులను అనుమతించే విషయమై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.