బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇది ఇలా ఉంటే రజనీకాంత్ కుటుంబ సభ్యులు మాత్రం కేవలం హెల్త్ చెకప్ కోసమే రజనీకాంత్ ఆస్పత్రికి వచ్చారు అని చెబుతున్నారు. దాంతో రజనీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా రజినీకాంత్ ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రజిని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పటికీ వయసు పెరగడం.. ఆరోగ్యం సహకరిస్తుందో లేదో అన్న అనుమానం తోనే సూపర్ స్టార్ డ్రాప్ అయ్యారు. ఇక తాజాగా రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా ట్రైలర్ కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.