హీరో సుధీర్ బాబు కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్

-

హీరో సుధీర్ బాబు త‌న కొత్త సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించారు. త‌న కేరీర్ లో 15 వ సినిమా షూటింగ్ సంబంధించిన వ‌ర్కింగ్ ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అధికారికంగా ప్ర‌క‌టించాడు. కాగ ఈ సినిమాకు హాస్య న‌టుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. అలాగే శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, ఎల్ఎలీపీ ప‌తాకం పై నారాయ‌ణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహ‌న్ రావు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ షూటింగ్ ను హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ప్రారంభించారు. కాగ ఈ సినిమా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతుంద‌ని సినిమా నిర్మాతలు తెలిపారు. హీరో సుధీర్ బాబు కోసం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ భిన్న మైన కథను రూపొందించారని తెలిపారు. అలాగే సుధీర్ బాబు ఈ సినిమా డిఫ‌రెంగ్ పాత్ర‌లో ప్రేక్ష‌కులకు క‌నిపిస్తార‌ని అన్నారు. అలాగే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ లో ప‌లు కీలక స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news