బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. దీంతో గంగూలీ కోల్‌కత్తాలోని వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజుల నుంచి గంగూలీ స్వల్ప అస్వస్థత గురి అయ్యాడు. దీంతో సోమ వారం రాత్రి గంగూలీకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఫలితం పాజిటివ్ అని తెలింది. కాగ ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. అలాగే ఆయన వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రి లో కరోనా కు చికిత్స తీసుకుంటున్నాడు.
కాగ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కరోనా సోకడం ఇదే తొలిసారి. గత ఏడాది ఐపీఎల్ సమయంలో సౌరవ్ గంగూలీ కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. కానీ అప్పుడు సౌరవ్ గంగూలీ కరోనా బారీన పడలేదు. కానీ తాజా గా సౌరవ్ గంగూలీ కరోనా బారీన పడ్డారు. అయితే సౌరవ్ గంగూలీ గత ఏడాది చాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన కార్డియాక్ అరెస్టుకు గురి అయ్యారు. ఆ సమయంలో గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టి చేశారు.