మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బీటెక్ పూర్తి చేసి రెండు నుంచి ఐదేళ్ల అనుభవం కలిగిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
ఎన్‌డీపీలపై పూర్తి అవగాహన, అనుభవంతో పాటు ఖాతాదారుల అవసరాలను తీర్చే విధంగా ప్లాస్టిక్స్, షీట్స్ మెటల్స్ జీడీ అండ్ టీలపై పట్టు ఉండాలి. హెచ్‌సీఎల్ అధికారిక వెబ్‌సైట్ లోని కెరీర్ పేజ్‌పై లాగినై డిసెంబర్ 31 లోగా అప్లై చేసుకోవాల్సి వుంది.
ఇది ఇలా ఉంటే ఐటీ దిగ్గజం విప్రో కూడా వచ్చే ఏడాది భారీగా ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఏకంగా 25,000కిపైగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.