మరోసారి సింహంలా గర్గించబోతున్న హీరో సూర్య..!!

-

తమిళ్ హీరో సూర్య కు తమిళంలో తో పాటు తెలుగు లోను మంచి మార్కెట్ వుంది. తనని తెలుగు పరిశ్రమ లో మాస్ హీరోగా నిలబెట్టిన మూవీ సింగం. ఆ సినిమా వచ్చి ఇప్పటికి 12 సంవత్సారాలు పూర్తిచేసుకకుంది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఆ సినిమా హీరో సూర్యకు మంచి పేరు తీసుకొచ్చింది.

దాని తర్వాత వచ్చిన సింగం 2, సింగం 3 కూడా మంచి లైన్ తో వచ్చి, మంచి వసూళ్లు సాధించాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా కు మరో సీక్వెల్ ని తీసుకొచ్చేందుకు డైరెక్టర్ హరి ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రయోగాలకి పెద్దపీట వేస్తున్న సూర్య అన్నీ ఒకేరకమైన సినిమాలు  వస్తున్నాయి అని ఫీల్ అయ్యాడట.

ఇప్పుడు మళ్లీ మాస్ ఆడియన్స్‌ని మెప్పించే సినిమా లో నటిస్తే కొద్దిగా చేంజ్ కోసం వెదుకుతుంటే మళ్లీ తన పాత మిత్రుడు అయిన డైరెక్టర్ హారి లైన్ లోకి వచ్చాడట. ప్రస్తుత చర్చల లో సినిమా లైన్ ఓకే అయ్యిందని కోలీవుడ్ మీడియా సమచారం.ఇక ప్రస్తుతం బాల, సిరుతై శివ సినిమాల్లో నటిస్తున్న సూర్య.. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత ‘సింగం 4’ పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version